Bus Accident : రాజస్థాన్ లో మరో బస్సు అగ్నికి ఆహుతి
రాజస్థాన్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. అగ్నికి ఆహుతి అయింది.
రాజస్థాన్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. అగ్నికి ఆహుతి అయింది. రాజస్థాన్ లోని మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కార్మికులను తీసుకెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు హైటెన్షన్ విద్యుత్తు లైన్ కు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు కార్మికులు మరణించగా, పన్నెండు మంది గాయపడ్డారు. బస్సు పూర్తిగా దగ్దమయింది.
ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ గేట్ ఫీజు చెల్లించాలని బస్సు డ్రైవర్ గ్రామాల నుంచి వస్తుండగా హైటెన్షన్ విద్యుత్తు లైన్ బస్సుకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. బస్సు పైభాగాన ఎక్కువ లగేజీ ఉన్నందున హైటెన్షన్ విద్యుత్తు లైన్ లు తగిలి బస్సులో మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.