Breaking : బస్సులో మంటలు.. పన్నెండు మంది సజీవ దహనం

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు

Update: 2025-10-14 13:03 GMT

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ లో ఈ ఘటనలో జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో దాదాపు ఇరవై ఐదు మంది గాయపడినట్లు సమాచారం. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ లో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

గాయపడిన వారిని...
మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. జైసల్మేర్ నుంచి జోథ్ పూర్ వెళుతున్న ప్రయివేటు బస్సులో వెళుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే పన్నెండు మంది మరణించారు. దీంతో స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణ సమయంలో యాభై మందికి పైగా ప్రయాణికులున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Tags:    

Similar News