Bengaluru Rave Party : నటి హేమతో పాటు పది మందికి నోటీసులు.. సోమవారం హాజరు కావాలంటూ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు

Update: 2024-05-25 07:43 GMT

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 86 మందికి పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే కొందరి అరెస్ట్...
బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయిచారు. హేమతో పాటు అషీరాయ్, రిషీ చౌదరి, వరుణ్ చైదరి, చిరంజీవి, కాంతి, రాజశేఖర్, ప్రసన్న, శివాని, జైశ్వాల్, సుజాత లకు కూడా బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులందాయి.


Tags:    

Similar News