Bengaluru : బెంగళూరులో అమానుషం
క్యాబ్ డ్రైవర్ తన కస్టమర్‌పై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో బయటపడింది
క్యాబ్ డ్రైవర్ తన కస్టమర్‌పై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో టోల్ రూట్ దాటకుండా డ్రైవర్ వెళ్లడంపై 19 ఏళ్ల విద్యార్థిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో డ్రైవర్ ఆమెపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటన అక్టోబర్ 20న జరిగినట్టు పోలీసులు తెలిపారు.
క్యాబ్ డ్రైవర్...
కేరళలోని త్రిసూర్‌కు చెందిన అజాస్ గా నిందితుడిని గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆ విద్యార్థిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. ఆమె విమానాన్ని అందుకోవడానికి ఆన్‌లైన్ క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరిందని బాధితురాలి మామ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఈ దాడికి దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.