బేగం బజార్ బంద్ కు పిలుపు.. అసలు అక్కడ ఏమి జరిగింది..?

బేగంబజార్ కోల్సావాడికి చెందిన 22 సంవత్సరాల నీరజ్ కుమార్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Update: 2022-05-21 04:49 GMT


హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని.. అది కూడా కులాంతర వివాహం కావడంతో కొందరు యువకుడిని నడిరోడ్డుపై హత్య చేశారు. బేగంబజార్‌లో ఓ యువకుడిని కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. మచ్చి మార్కెట్ వద్ద దుండగులు యువకుడిని నడిరోడ్డుపై కత్తితో సుమారు 20 సార్లు పొడిచి చంపేశారు. మృతుడిని నీరజ్ పన్వర్‌గా గుర్తించారు. ఏడాది కిందట అతడు అఫ్జల్‌గంజ్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడికి 3 నెలల వయసున్న బాలుడు ఉన్నాడు.

బేగంబజార్ కోల్సావాడికి చెందిన 22 సంవత్సరాల నీరజ్ కుమార్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంజన కుటుంబీకులు నీరజ్ మీద కక్షపెంచుకున్నారు. సంజన సోదరుడు నీరజ్ ను ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు. ఇటీవలి కాలంలో సంజన సోదరుడు నీరజ్ ఏమేమి చేస్తుంటాడో మొత్తం తెలుసుకున్నాడు. శుక్రవారం జనసంచారం తక్కువగా ఉండటంతో రోడ్డు దాటుతుండగా వెనకనుంచి వచ్చి నీరజ్ మీద దాడి చేశారు. అతని తలపై గ్రానైట్ రాయితో మోదారు. ఆ తర్వాత కొబ్బరిబోండాల కత్తితో పొడిచి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతడిని షాహీనాయత్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నీరజ్ ను చంపింది ఐదుగురు అని నిర్ధారించుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి.పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నీరజ్ మృతితో ఆగ్రహం చెందిన బేగంబజార్ వ్యాపారులు శుక్రవారం అర్ధరాత్రి భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. శనివారం బేగంబజార్ బంద్ కు పిలుపునిచ్చారు. హత్య తర్వాత కర్నాటక పారిపోయిన ఐదుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News