కూతురికి ఆశీస్సులు.. తండ్రి అనంతలోకాలకు...!

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంలో పుట్టినరోజు పార్టీ గోవాలో ఇచ్చిన అర్జున్ కుమార్ కూడా మరణించారు.

Update: 2022-06-03 07:41 GMT

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అందరూ ఒక కుటుంబానికి చెందిన వారు. సన్నిహితులు కూడా కొందరు ఉన్నారు. కూతురి పుట్టిన రోజు ఘనంగా చేద్దామనుకున్నాడు. ఇక్కడ కాకుండా విన్నూత్నంగా గోవాకు కుటుంబీకులను, సన్నిహితులను తీసుకెళ్లాలనుకున్నాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్. మొత్తం 32 మంది కుటుంబీకులు, స్నేహితుల కుటుంబాలతో కలసి గోవాలో ఆరెంజ్ ట్రావెల్స్ లో గత నెల 29న గోవా బయలుదేరి వెళ్లారు. కొంపల్లిలోని సుచిత్ర నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు 29 రాత్రికి బయలుదేరి వెళ్లింది. అర్జున్ కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండటంతో సన్నిహితులను, కుటుంబీకులకు గోవాలో మంచి విందు ఇవ్వాలనుకున్నారు.

నాలుగు రోజుల పాటు....
30న గోవాకు చేరుకున్న ఈ బృందం అక్కడ నాలుగు రోజుల పాటు ఎంజాయ్ చేసింది. కూతురికి అందరికీ ఆశీర్వచనాలు లభించాయి. నిన్న సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గోవా నుంచి బయలు దేరింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. ఆరు గంటల నుంచి 11 గంటల వరకూ ఒక డ్రైవర్ బస్సును నడిపారు. అక్కడ డిన్నర్ ముగించుకున్న తర్వాత మరో డ్రైవర్ తెల్లవారు జామున 5 గంటల వరకూ బస్సును నడిపారు. ఐదు గంటల వరకూ రెస్ట్ తీసుకున్న డ్రైవర్ ఆ తర్వాత స్టీరింగ్ ను అందుకున్నారు. బస్సును తన హ్యాండోవర్ లోకి తీసుకున్న అరగంటకే ప్రమాదం జరిగింది.
కొందరిని స్థానికులు.....
ఈ ప్రమాదంలో పుట్టినరోజు పార్టీ ఇచ్చిన అర్జున్ కుమార్ కూడా మృతి చెందాడు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకోలేదు. అందరూ గాఢ నిద్రలో ఉండటంతో రెండు డోర్లను పగలకొట్టి స్థానికులు 12 మందిని బయటకు తీయగలిగారు. దాదాపు 12 మంది గాయాలపాలవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. బస్సులో ముగ్గురు బస్సు సిబ్బంది, 32 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. మృతులంతా ఆల్వాల్, కూకట్ పల్లి, షేక్ పేట్, మణికొండ వాసులు అని తెలుస్తోంది. బస్సు సిబ్బంది ముగ్గురు సురక్షితంగా ఉన్నారు.


Tags:    

Similar News