Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

Update: 2025-08-17 07:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్న గూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొబ్బరికాయ లోడుతో వెళుతున్న లారీని వెనక నుంచి వచ్చిన మరొక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కొబ్బరికాయ లోడుతో వెళుతున్న లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు.

మృతులు వీరే...
పాలకొల్లు నుంచి హైదరాబాద్ కు కొబ్బరికాయ లోడుతో వెళుతున్న లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ రాజేశ్, క్లీనర్ లక్ష్మణ్ లు మరణించినట్లుగా పోలీసులు గుర్తించారు. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News