ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రివార్డు పాయింట్ల స్కామ్ తో..!

ఒంగోలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో కంప్యూటర్ సైన్స్

Update: 2023-09-13 09:42 GMT

అద్భుతమైన స్టూడెంట్.. గొప్ప పొజిషన్ లోకి వెళతాడు అని చదువు చెప్పిన గురువులు కూడా భావించారు. కానీ అతడు అనుకోని రూట్ లో వెళ్ళాడు. తొందరగా డబ్బు సంపాదించేయాలని ప్రయత్నించి.. ఊహించని విధంగా కటకటాల పాలయ్యాడు.

ఒంగోలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ 23 ఏళ్ల యువకుడిని బెంగళూరు పోలీసులు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి రూ.4.16 కోట్ల విలువైన రివార్డ్ పాయింట్లను స్వాహా చేసినందుకు అరెస్టు చేశారు. నిందితులు దాదాపు 6 లక్షల గిఫ్ట్ వోచర్లను మోసపూరితంగా రీడీమ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బొమ్మలూరు లక్ష్మీపతిని అరెస్టు చేసినట్లు మంగళవారం బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద ప్రకటించార. అతని నుండి 5 కిలోల బంగారంతో సహా రూ.4.16 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ కేసుల్లో బెంగళూరు పోలీసులు చేసిన అతిపెద్ద సీజ్ ఇదే.
బంగారు బిస్కెట్లు, 27 కిలోల వెండి వస్తువులు, ఏడు ద్విచక్రవాహనాలు, కారు మొదలైన వాటిని లక్ష్మీపతి నుండి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన లక్ష్మీపతి బీటెక్‌ చదివాక దుబాయిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. బెంగళూరుకు వచ్చాక వివిధ ఐటీ సంస్థల్లో పని చేశాడు. ఇదే సమయంలో వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేయడంలో నైపుణ్యాన్ని సాధించాడు. రూ.కోట్లు సంపాదించాడు. రివార్డు పాయింట్‌ లకు సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్‌ చేసి వివిధ సంస్థల వినియోగదారులకు ఇచ్చే గిఫ్ట్‌ ఓచర్లను సొంతం చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 360 సార్లు వెబ్సైట్ ను హ్యాక్‌ చేసి వినియోగదారులను మోసం చేసినట్లు గుర్తించారు. ఈ మోసాలను వెబ్‌సైట్‌ నిర్వాహకులు గమనించి సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో లక్ష్మీపతి చేసిన స్కామ్ బయటపడింది.


Tags:    

Similar News