జంతువు అనుకుని మనిషిపై కాల్పులు
అడవి పంది అనుకుని కొందరు వేటగాళ్లు ఒకవ్యక్తిని చంపిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
అడవి పంది అనుకుని కొందరు వేటగాళ్లు ఒకవ్యక్తిని చంపిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. పాల్ఘర్ జిల్లాకు చెందిన కొందరు గ్రామస్థులు ఈ నెల 28వ తేదీన అడవి పందులను వేటాడేందుకు బోర్షెటీ అడవికి వెళ్లారు. కొన్ని బృందాలుగా విడిపోయి అడవి పందులను వేట ప్రారంభించారు.
రాత్రి వేళ కావడంతో...
అయితే పొదల్లో కూర్చోవడంతో రాత్రి వేళ కావడంతో మరొక బృందం పొదల్లో కదలికలను చూసి కాల్పులు జరిపారు. అయితే ఆ పొదల్లో అడవి పంది లేదు. తమ బృందంలోని సభ్యుడే ఉన్నాడు. ఈ కాల్పుల్లో పొదల్లో ఉన్న వ్యక్తి మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ బృందంలోని ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.