Tirupathi : తిరుపతిలో విషాదం.. ముగ్గురు మృతి
తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు పడి మరణించారు
తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు పడి మరణించారు. మంగళం పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్కారం తుడా క్వార్టర్స్ సమీపంలోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నెంబరు 63 లోఐదంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనం శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య నిర్మిస్తున్నారు.
భవన నిర్మాణం కోసం...
ఈ భవన నిర్మాణం కోసం పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంత్, కె. శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ్ పనిచేస్తున్నారు. ఐదో అంతస్థులో పని చేస్తుండగా కర్రలు విరిగిపోయాయి. దీంతో ఈ ప్రమాదం నుంచి మాధవ్ తప్పించుకుని బయటపడగా, మిగిలిన ముగ్గురు పై నుంచి కిందపడి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.