Veeraiah Choudary Murder : వీరయ్య చౌదరి మర్డర్ స్కెచ్ చేతికి మట్టి అంటకుండా.. జులాయి మూవీ ప్లాన్ తరహాలో

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును నిందితులు జులాయి సినిమాను ఫాలోఅయినట్లు తెలిసింది.

Update: 2025-05-04 04:46 GMT

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును నిందితులు జులాయి సినిమాను ఫాలోఅయినట్లు తెలిసింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సుపారీ ఇవ్వడమే కాకుండా ఆధారాలను దొరకకుండా ప్రయత్నం చేశారు. పక్కా పథకం ప్రకారమే టీడీపీ నేత వీరయ్య హత్య జరిగింది. ఈ హత్య కేసులో స్థానికంగా ఉండే దేవేంద్రనాధ్, విదేశాల్లో ఉన్న సురేష్ కారణమని ప్రాధమికంగా తెలిసినా హంతకులను ఎంచుకోవడంలోనూ, వారికి సుపారీ చెల్లించడంలోనూ జులాయి సినిమా తరహాలో స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జులాయి సినిమాలో బ్యాంక్ రాబరీకి ఒకరికి ఒకరు తెలియకుండా నిందితులను సమకూర్చుకుని సోనూ సూద్ ఆ మూవీలో దోపిడీకి పాల్పడిన ఘటనను తలిపిస్తూ వీరయ్య చౌదరి మర్డర్ ప్లాన్ జరిగిందని చెబుతున్నారు. గత నెల 22వ తేదీన ఒంగోలులో దారుణ హత్యకు గురైన ఘటనలో సినిమా ఫక్కీలో స్కెచ్ వేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన...
కిరాయి హంతకులను కూడా పొరుగు జిల్లాలోని నెల్లూరు జిల్లాను ఎంచుకున్నారు. అక్కడి నుంచి హైర్ చేసుకున్నారు. అయితే వీిరికి సుపారీ ఇచ్చింది కూడా ఒంగోలులో చిరు వ్యాపారాలు చేసుకునే ఒక వ్యక్తిని ఎంచుకుని అతని ద్వారా సుపారీని హంతకులకు చెల్లించినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. వీరయ్య చౌదరి ఫొటోను హంతకులకు ముందుగా చేర్చడంతో పాటు ఆఫీస్ లో వీరయ్య చౌదరి కూర్చున్న ఫొటోను నిందితులకు ఇచ్చారు. దాని ప్రకారం వీరయ్య చౌదరిని గుర్తుపట్టే విధంగా హంతకులకు అన్ని ఆధారాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఈ హత్యకు పాల్పడ్డారని ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు అక్కడకు వెళ్లి విచారించగా వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.
నెల రోజుల స్కెచ్...
ఇసుక వ్యాపారి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించారని కూడా గుర్తించారు. వీరయ్య చౌదరి మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాతనే నిందితులు స్పాట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే వీరయ్య చౌదరి హత్య ఇంత పక్కాగా అమలు చేయడానికి నిందితులు నెల రోజుల నుంచి స్కెచ్ వేసినట్లు తెలిపారు. వీరయ్య చౌదరి రాకపోకలను, కార్కక్రమాలను పసిగట్టిన తర్వాత అదను చూసుకుని వేటు వేశారు. వీరయ్య చౌదరి కదలికలతో పాటు తాము త్వరగా తప్పించుకునేందుకు వీలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత నిందితులు హత్యకు దిగారని పోలీసులు భావిస్తున్నారు. వీరయ్య చౌదరి మర్డర్ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమేం వెలుగు చూస్తాయన్నది చూడాలి. హంతకులు ఎంత పకడ్బందీగా వ్యవహరించారో తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.










Tags:    

Similar News