నేడు కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు నేడు హైదరాబాద్ లోని సీబీఐ న్యాయస్థానంలో హాజరు కానున్నారు.

Update: 2023-02-10 03:06 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు నేడు హైదరాబాద్ లోని సీబీఐ న్యాయస్థానంలో హాజరు కానున్నారు. కడప జిల్లా నుంచి భారీ భద్రత నడుమన నాలుగు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ కు పోలీసులు తరలించారు. అత్యంత రహస్యంగా వీరిని తరలించారు. ఉదయం పదిన్నర గంటలకు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. కడప జిల్లా జైలులో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డిలను హాజరుపర్చనున్నారు.

తొలి సారి సీబీఐ కోర్టుకు...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ కు బదిలీ అయిన ఈ కేసును సీబీఐ కోర్టులో తొలిసారి హాజరుపర్చనున్నారు. కడప జైలులో ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డిలతో పాటు బెయిల్ పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిలు కూడా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. తొలిసారి న్యాయమూర్తి సీబీఐ కోర్టులు ఐదుగురు నిందితులను విచారించనున్నారు. ముగ్గురు నిందితులను సీబీఐ కోర్టులో విచారణ అనంతరం కడప జిల్లా జైలుకు తరలిస్తారా? లేదా హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News