అతివేగమే పదకొండు మంది మరణానికి కారణమా?
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాధ్ ఆలయానికి వెళుతూ బొలేరో వాహనం అదుపు తప్పి కాలువలో పడటంతో పదకొండు మంది మృతి చెందారు. అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి కాల్వలోకి వెళ్లిందని చెబుతున్నారు. పరాసరాయ్ - ఆలవాల్ డియోర మార్గంలోని రేుహారి గ్రామంలో ఉన్న సరయూ కాల్వలో ఈ వాహనం బోల్తా పడింది.
కాల్వలో పడి...
అయితే ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో పదిహేను మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరంతా సిహాగావ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. నలుగురికి ఈ ప్రమాదంలో గాయాలు కాగా వారిని ఆసుతప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు జోరున వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారడంతో ఆలస్యంగా వాహనం నుంచి మృతదేహాలను వెలికి తీశారు.