Train Accident : ప్రమాదంలో ఏడుగురు మృతి.. రైలు ప్రయాణిస్తుండగా ఘటన

రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రమాదం జరిగింది. రైల్వేట్రాక్‌ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు

Update: 2025-06-01 04:26 GMT

రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రమాదం జరిగింది. రైల్వేట్రాక్‌ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. బ్రయాన్క్స్ ప్రాంతంలో రైలు వెళుతుండగా ఒక్కసారి వంతెన పై నుంచి పక్కకు తప్పిపోయింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా రైలు కింద పడిపోయింది.

మాస్కో నుంచి వెళుతుండగా...
మాస్కో నుంచి క్లిమోవ్ కు రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాలను తెలిసిన వెంటనే సహాయక బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అత్యవసర సేవలను కొనసాగిస్తున్నట్లు స్థానిక గవర్నర్ అలెగ్జాండర్ తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థిి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News