హైదరాబాద్ - విజయవాడ రహదారిపై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ప్రమాదం జరిగింది.. బస్పు, రెండు కార్లతో పాటు కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు
హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ప్రమాదం జరిగింది.. బస్పు, రెండు కార్లతో పాటు కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొందరు గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.
వేగంగా వస్తున్న...
చిట్యాల సమీపంలో ముందుగా వెళుతున్న ప్రయివేటు బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కారు ఢీకొట్టింది. ఆవెంటనే దాని వెనక వస్తున్న కంటైనర్ కూడా ఢీకొట్టింది. దీంతో బస్సు కిందకు కారు దూసుకెళ్లడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో దానిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు.