Breaking : తమిళనాడులో స్కూలు బస్సు ను రైలు ఢీ ముగ్గురు విద్యార్థుల మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మరణించారు

Update: 2025-07-08 03:14 GMT

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మరణించారు. కడలూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు రైలుగేటు దాటుతుండగా బస్సును రైలు ఢీకొట్టింది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది గాయపడినట్లు సమాచారం.

మృతుల సంఖ్య మరింత...
అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడలూరు జిల్లా చెమ్మగుప్పంలో రైలు గేటు దాటుతుండగా స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొట్టందని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకని సహాయక చర్యలు ప్రారంభించారు.


Tags:    

Similar News