రాజస్థాన్ లో ఘోర ప్రమాదం... నలుగురి మృతి
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల భవనం పైకప్పు కూలిపోవడంతో నలుగురు మరణించారు
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల భవనం పైకప్పు కూలిపోవడంతో నలుగురు మరణించారు. రాజస్థాన్ లోని ఝలావర్ లో ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మరణించారు. అనేక మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. పాఠశాల శిధిలాల కింద దాదాపు డెబ్భయి మంది చిన్నారులు చిక్కుకున్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య...
సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నలుగురు మృతదేహాలను శిధిలాల నుంచి వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాజస్థాన్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.