గాల్లోనే హాట్ బెలూన్ లో మంటలు.. ఎనిమిది మంది మృతి

బ్రెజిల్ లో ఘోర ప్రమాదం జరిగింది. గాల్లోనే హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు రావడంతో ఎనిమది మంది మరణించారు.

Update: 2025-06-22 01:50 GMT

బ్రెజిల్ లో ఘోర ప్రమాదం జరిగింది. గాల్లోనే హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు రావడంతో ఎనిమది మంది మరణించారు. బ్రెజిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాల్లో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు చెలరేగడంతో అది కిందపడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా పదమూడు మంది గాయపడ్డారు. బ్రెజిల్ లోని శాంటా కేథరినాలో ఒక హాట్ ఎయిర్ బెలూన్ గగనతలంలో పర్యటించడం కోసం గాల్లోకి ఎగిరింది. అందులో పైలట్ తో పాటు మరో ఇరవై ఒక్కమంది ప్రయాణిస్తున్నారు.

కింద పడి పోవడంతో...
గాల్లోకి ఎగిరిన కాసేపటికే హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బెలూన్ కాలిపోయి కిందపడిపోయింది. ఈ ఘటనలో పదమూడు మంది గాయపడగా, ఎనిమిది మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలకి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. బ్రెజిల్ లో తరచూ గాల్లోకి ఎకరగానే హాట్ ఎయిర్ బెలూన్లు కూలిపోవడం జరుగుతుంది. గత వారం కూడా హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయి ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘనలో పదకొండు మంది గాయపడ్డారు.


Tags:    

Similar News