ఫ్లాట్‌లో యువతి శవం.. ప్రియుడి కోసం వేట

బెంగళూరు నగరంలోని తన ఫ్లాట్‌లో 23 ఏళ్ల యువతి శవమై కనిపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇది హత్యగా అనుమానించిన

Update: 2023-06-07 06:38 GMT

బెంగళూరు నగరంలోని తన ఫ్లాట్‌లో 23 ఏళ్ల యువతి శవమై కనిపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇది హత్యగా అనుమానించిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె స్నేహితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆకాంక్ష బిద్యాసర్ రూమ్‌మేట్ సోమవారం ఫ్లాట్‌కు తిరిగి వచ్చిన తర్వాత.. గదిలో ఆకాంక్ష చనిపోయిందని గుర్తించడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. మంచంపై ఆకాంక్ష బిద్యాసర్ మృతదేహాన్ని చూసిన ఆమె రూమ్‌మేట్ షాక్ అయ్యింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

మెడకు చున్నీతో మంచంపై ఆకాంక్ష మృతదేహం పడి ఉందని పోలీసులు తెలిపారు. ఆకాంక్ష బెంగళూరులోని ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగి. సోమవారం నాడు ఆకాంక్ష స్నేహితురాలు అర్పిత్ గురిజాల ఆమెను చూసేందుకు వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యలో గురజాల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అర్పిత్, ఆకాంక్ష హైదరాబాద్‌లో కలిసి పనిచేసేవారని పోలీసులు తెలిపారు. ఇటీవలే ఆకాంక్ష బెంగళూరుకు షిఫ్ట్ అయింది.

Tags:    

Similar News