బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా 14 ఏళ్ల లోపువారే..

కర్ణాటకలోని కలబురిగిలో జరిగిన ఈ దారుణ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జులై 5న బాధిత బాలిక ఇంటి ముందు..

Update: 2023-07-09 05:18 GMT

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. 8 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులంతా 10 నుంచి 14 ఏళ్ల లోపువారు వారే కావడం సంచలనానికి దారితీసింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి.. తల్లిదండ్రులే పరోక్షంగా ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. 10 ఏళ్లైనా దాటని బాలుడి నుండి.. ఆరుపదులు దాటిన వృద్ధుడి వరకూ కామంతో రెచ్చిపోతున్నారు. ఫలితంగా బాలికలు, యువతులు, మహిళలు అత్యాచార బాధితులవుతున్నారు.

కర్ణాటకలోని కలబురిగిలో జరిగిన ఈ దారుణ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జులై 5న బాధిత బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా.. నలుగురు నిందితులు చాక్లెట్లు ఇస్తామని, రూ.10 ఇస్తామని ఆశ చూపించారు. బాలికను ఆ నలుగురూ.. ఐదో వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా.. వారు చేసిన విషయం గురించి తెలిపింది. వెంటనే తల్లిదండ్రులు కలబురిగి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
నిందితులపై పోక్సో చట్టంకింద కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 366ఎ, 376 (జి), 506 కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి జువైనల్ జస్టిస్ ముందు హాజరు పరచగా.. 14 రోజులు కరెక్షన్ హామ్ కు పంపించారు. ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News