నాలుగేళ్ల బాలికపై పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణం

శుక్రవారం నాడు రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో నాలుగేళ్ల బాలికపై

Update: 2023-11-11 05:10 GMT

శుక్రవారం నాడు రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో నాలుగేళ్ల బాలికపై పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. లాల్సోట్ ప్రాంతంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. భూపేంద్ర సింగ్ అనే నిందితుడు మైనర్‌ను మధ్యాహ్నం తన గదికి పిలుచుకుని, ఆమెపై అత్యాచారానికి ASP రామచంద్ర సింగ్ నెహ్రా మీడియాకి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రహువాస్ పోలీస్ స్టేషన్‌ కు చేరుకున్నారు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు స్థానికులు అతడిని చితక్కొట్టారు.

రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేసి నిందితుడికి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనంతో.. పోలీసులు ఎన్నో దారుణాలలో భాగమయ్యారని.. ఎన్నికల సమయంలోనూ దారుణాలకు తెగబడుతున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దౌసా ఎస్పీ వందిత రాణా మాట్లాడుతూ, “బాధిత బాలిక ఖచ్చితమైన వయస్సును వైద్య పరీక్షల తర్వాత తెలుస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల నివేదిక ఆధారంగా బాలిక వయస్సు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు." అని తెలిపారు. నిందితుడిని శిక్షిస్తామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News