హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. భారీగా కొకైన్ స్వాధీనం
భాగ్యనగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా.. స్మగ్లర్లు మాత్రం గుట్టు..
huge quantity of narcotics seized in hyderabad
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీగా కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు నిందితుల్ని పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
భాగ్యనగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా.. స్మగ్లర్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా దందా సాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక నైజీరియన్ బెంగళూరు నుండి నగరానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. 180 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ నగరంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో.. ఇదే అధికమొత్తంలో పట్టుబడిన కేసు కావడం గమనార్హం. నైజీరియన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.