Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

Update: 2025-11-24 07:05 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ముప్ఫయి ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కడయనల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలున్నారు. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

రెండు ప్రయివేటు బస్సులు...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.


Tags:    

Similar News