Road Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

Update: 2025-11-27 04:49 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పెళ్లి బృందంతో వెళుతున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని జాన్ పూర్ లో జరిగింది. పెళ్లి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా అదుపు తప్పి కారు బోల్తా పడటంతో అక్కడికక్కడే మరణించారు.

ముగ్గురి మృతి...
వారణాసి నుంచి పెళ్లి ఊరేగింపు జాన్ పూర్ కు వచ్చింది. జాన్ పూర్ కు వచ్చిన పెళ్లి బృందం తిరిగి కారులో బయలుదేరి తిరిగి వెళుతుండగా కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు.


Tags:    

Similar News