Road Accident : డ్రైవర్ కు గుండెపోటు.. నలుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో జనం మీదకు దూసుకు రావడంతో నలుగురు మరణించారు. కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలోని అంబర్ నాధ్ ఫ్లై ఓవర్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అదుపు తప్పి...
పోలీసుల కథనం ప్రకారం శివసేన కు చెందిన కిరణ్ చాబే ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా కారు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనాలపై కి వచ్చింది. కారు అతివేగంగా దూసుకు రావడంతో ఫ్లై ఓవర్ నుంచి ఒక యువకుడు కిందపడిపోయిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో అతి పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు