Road Accident : కర్ణాటకలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు నలుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు. కర్ణాటకలోని హల్లిఖేడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వ్యాను ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన నలుగురు తెలంగాణకు చెందిన వారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాధ్ పూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది.
దత్తాత్రేయ దర్శానికి వెళ్లి...
నలభై ఏళ్ల నవీన్, నలభై ఐదేళ్ల రాచప్ప, అరవైఏళ్ల కాశీనాధ్, నలభై ఏళ్ల నాగరాజులుగా గుర్తించారు. వీరు గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రతికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణాలోని జగన్నాధ్ పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.