Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు

Update: 2025-10-13 04:23 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బెరండపల్లి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లి తన స్నేహితులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కారును పలు వాహనాలు ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు మరణించారు. మృతులందరూ తమిళనాడు లోని పలు ప్రాంతాలకు చెందిన స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా స్నేహితులని పోలీసులు తెలిపారు.

కెనడా నుంచి వచ్చి...
మృతులను మదన్, గోకుల్, ముకిలన్, మణివన్నన్ గా పోలీసులు గుర్తించారు. కెనడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న మదన్ కుమార్ కు ఐదు నెలల క్రితం వివాహమయింది. అయితే దీపావళి పండగకు కెనడా నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న మదన్ తీసుకుని వచ్చేందుకు స్నేహితులందరూ కారులో బయలు దేరి వెళ్లారు. అయితే కంటైనర్ సడెన్ గా బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, వెనక వస్తున్న వాహనాలు స్పీడ్ గా వస్తూ ఈ కారును గుద్దుకోవడంతో కారులో ఉన్న నలుగురు స్నేహితులు మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News