గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నూట యాభై రూపాయలు పెరిగింది.

Update: 2023-09-19 03:06 GMT

పసిడి అంటే ఎవరికి ఇష్టముండదు. అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలు ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటాయి. వాటిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ధరలు పెరుగుదలతో బంగారం కొందరికే పరిమితమయిపోయింది. అయినా సరే బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. భవిష్యత్ లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని భావించి ముందుగానే కొనుగోలు చేసే వారు అధికంగా ఉన్నారు. పెట్టుబడుల కోసం పసిడిని కొనుగోలు చేసే వారు ఎక్కువమంది అయితే, స్టేటస్ సింబల్ గా చూసే వారు అనేక మంది ఉన్నారు.

నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నూట యాభై రూపాయలు పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధరపై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 55,050 రూపాయలుగా నమోదయి ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,080 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో 78,200 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News