Gold Price Today : భారీగా దిగివచ్చిన బంగారం.. కనిష్టానికి పడిపోయిన వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి.

Update: 2026-02-14 04:16 GMT

బంగారం ధరలు పతనమవుతున్నాయి. నిజంగా ఒక రకంగా కొనుగోలు చేసే వారికి ఇది తీపికబురు అని చెప్పాలి. పసిడి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ బంగారం, వెండి వస్తువులు తమ ఇంట్లో ఉండాలనుకుంటారు. అత్యవసర సమయంలో తమతో పాటు తమ కుటుంబానికి భద్రతగా నిలవడమే కాకుండా ఎంత ఎక్కువ ఉంటే అంత శుభప్రదమని నమ్ముతారు. ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి తరతరాల నుంచి వస్తున్న విషయమే. అందుకే బంగారం కొనుగోళ్లు భారత్ లో జరుగుతున్నంతగా ఎక్కడా జరగకపోవడానికి లేదు. విదేశాల్లో అయితే ఎక్కువగా బంగారం బాండ్లపైనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతారు.

మదుపు చేసే వారు...
ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పతనం కావడంతో నష్టపోయిన వారు కొంత పెట్టుబడి పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు. భారీ పెరుగుదల చేసి స్వల్ప కాలంలో అధిక లాభం వస్తుందని ఆశపడి అప్పులు తెచ్చి మరీ బంగారం, వెండిపై మదుపు చేశారు. వారంతా భారీగా నష్టపోయారు. మరికొందరు భారీగా ధరలు ఉన్నప్పుడు తమ వద్ద ఉన్న బంగారం, వెండిని అమ్మకానికి పెట్టడంతో భారీగా లాభాలను గడించారు. ఇలా బంగారం, వెండి కొందరికి లాభాలు తెచ్చిపెట్టగా, మరికొందరికి నష్టాలను తెచ్చిపెట్టింది. రానున్న కాలంలో ధరలు ఎలా ఉంటాయన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారు.
నేటి ధరలు
అయితే బంగారం, వెండి ధరలలో మార్పుపై అంచనాలు ఎప్పటికీ నిజం కావు. తగ్గుతాయని భావిస్తే పెరుగుతాయి. పెరుగుతాయనుకుంటే తగ్గుతాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధరలు ఎలా ఉంటాయన్న అంచనాకు రాలేకపోతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి. పది గ్రాముల బంగారం ధరపై పదిహేను వందలు తగ్గింది. కిలో వెండి పై పదిహేను వేల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,42,800 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,55,780 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2.80,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి పతనమవుతాయా? పెరుగుతాయా? అన్నది చెప్పలేం.


Tags:    

Similar News