Gold Price Today : బంగారం లక్షకు దిగువకు చేరుకుంటుందా? నిపుణులేమంటున్నారంటే?

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

Update: 2026-02-16 04:11 GMT

బంగారం ధరలు దిగివస్తున్నాయి. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. ధరలు ఇలా పెరిగి అలా తగ్గుతున్నాయి. అయితే ఇంకా ఆశించిన స్థాయిలో మాత్రం ధరలు తగ్గలేదు. గరిష్ట స్థాయికి చేరుకుని బంగారం, వెండి ధరలు అందరికి మొన్నటి వరకూ షాకిచ్చాయి. ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అంత పోసి బంగారం, వెండి కొనుగోలు చేయలేని పరిస్థితి. ఎంత అవసరమైనా ధరలను చూసి బెంబేలెత్తి బంగారు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అంచనాలకు మించి బంగారం, వెండి ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గడంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా నిర్వహణ ఖర్చులు కూడా రాలేదని వాపోయారు.

పతనమవుతాయని...
బంగారం, వెండి ధరలు ఇలా పెరగడంతోనే ఖచ్చితంగా పతనమవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రానున్న కాలంలో ఎంత మేరకు దిగివస్తాయన్నది చెప్పలేం. కానీ కొనుగోలు చేసేటంత ధరల్లో బంగారం, వెండి వస్తువులు లభ్యమవుతాయన్న ఆశలు మిణుకు మిణుకు మంటూ కనిపిస్తున్నాయి. రానన్న రోజుల్లో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దిగువకు పడిపోతాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిని నమ్మి కొనుగోలు చేయకుండా ఉండవద్దని, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కొట్టిపారేయలేం. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. వెండి పతనం కూడా కొనసాగుతుందంటున్నారు.
నేటి ధరలు ఇలా...
ఇక పెళ్లిళ్ల సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు కూడా మరింత పెరగనున్నాయి. అయితే ధరలు తగ్గుతాయా? లేదా? అన్నది చెప్పలేని పరిస్థితి. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,57,740 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరలు 2,79,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి మార్పులుండవచ్చు.




Tags:    

Similar News