Gold Price Today : గుడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధరలు పెరగలేదండోయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2026-02-13 03:22 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే పూర్తిగా అందుబాటులోకి రాలేదు కానీ, ధరలు మాత్రం చాలా వరకూ తగ్గాయి. ధరల విషయంలో ఇప్పటికే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పాటు తగ్గినప్పుడు మాత్రం స్వల్పంగా తగ్గడం జరుగుతుండటమే దీనికి కారణం. అయితే ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాల మధ్య కొందరు పెట్టుబడి పెట్టిన వారు తీవ్రంగా ఇప్పటికే నష్టోయిన పరిస్థితులున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి మాత్రం ఈసారి భారీగా నష్టాన్ని తెచ్చి పెట్టింది.

ధరల్లో మార్పునకు...
బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్లతో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా వివిధ దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, యుద్ధాలు వంటివి బంగారం, వెండి వస్తువుల ధరల్లో మార్పునకు కారణమయ్యాయి. అయితే ధరలు పెరుగుదలకు, తగ్గుదలకు స్థానిక మార్కెట్లలోని డిమాండ్లతో సంబంధం లేదని, అంతర్జాతీయంగా జరిగే అనేక మార్పులు వల్ల ఉంటుందని చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ మార్కెట్ ప్రభావం కూడా ధరలపై ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా అనేక కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయి.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్లు ఎక్కువ కావడంతో ధరలు కూడా దానికి తగినట్లుగానే పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై వంద రూపాయాలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,45,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,58,390 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,99,900 రూపాయలుగా ట్రేడ్ అయింది.




Tags:    

Similar News