Gold Prices Today: బంగారం ధరలు ఈ వారంలో భారీగా పెరుగుతాయా?

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి

Update: 2026-04-13 04:09 GMT

బంగారం ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా - ఇరాన్ ల మధ్య కాల్పుల విరమణకు రెండు వారాలు ఉండటంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత మూడు నుంచి నాలుగు రోజుల్లో దాదాపు మూడు వేల రూపాయలు బంగారం పెరిగింది. అయితే ఈ వారం బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయా? అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే తిరిగి యుద్ధం మొదలయితే మాత్రం ధరలు మళ్లీ తగ్గుతాయని అంటున్నారు. కానీ కాల్పుల విరమణ జరిగే రెండు వారాల వరకూ ధరలు పెరిగే అవకాశం లేదన్నది మరొక అంచనా వినిపిస్తుంది.

ఎప్పుడు పెరుగుతాయంటే?
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. తగ్గుతాయో? అన్నది మాత్రం ఎవరూ అంచనా వేయలేని విషయం. గతంలోనూ ధరలు పెరగవని ఇంకా తగ్గుతాయని భావించి అనేక మంది ఆశతో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ధరలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. మూడు నాలుగు రోజుల్లోనే మూడు వేల రూపాయల వరకూ పెరగడంతో ధరలు ఇక తగ్గే అవకాశం లేదన్న అంచనాలను మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారంలో ధరలు మరింత ఎక్కువగా పెరుగుతాయని కూడా బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. దీంతో మదుపు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న అంచనాలున్నాయి.
ధరలు పెరుగుతాయని...
ధరలు పెరిగే అవకాశముందని తెలియడంతో పెట్టుబడి దారులు ఎక్కువ మంది బంగారం, వెండిపై మదుపు చేయడం ప్రారంభించారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,52,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News