Gold Rates Today : బంగారం భరోసా ఇస్తుందనుకుంటే.. ఇలా భయపెడుతుందేమిటో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న మార్కెట్ నిపుణుల అంచనా నిజమయ్యేటట్లే కనిపిస్తుంది. పసిడి ధరలు మరింతగా పరుగులు తీస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఒకరోజు తగ్గుతూ, ఎక్కువ రోజులు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు ముందుగా అంచనా వేసి గత కొన్ని నెలలుగా చెబుతున్నారు. అయితే ధరలు దిగివస్తాయేమోనని భావించిన అనేక మంది బంగారాన్ని కొనుగోలు చేయకుండా వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్య మైన పనికాదన్న విషయం అర్థమయింది. ఎందుకంటే పెరిగిన ధరలతో బంగారాన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు వేతన జీవులకు సాధ్యం కాని పని.
బంగరం అంటే భరోసా...
బంగారం, వెండి ఆభరణాలు సొంతం చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అవి తమ దగ్గర ఉంటే జీవితానికి భరోసా ఉంటుందని అనుకుంటారు. కష్ట సమయాల్లో బంగారం తమకు తోడుగా ఉంటుందన్న నమ్మకంతో అవసరం ఉన్నా లేకపోయినా కొంత మేర బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటారు. కొద్దికొద్దిగా తాము దాచుకున్న మొత్తంతో బంగారం, వెండి కొనుగోలు చేశామంటే తమకు దిగులు ఉండదన్న భరోసాలో ఉంటారు. అదేసమయంలో పెట్టుబడి దారులు సయితం సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఎక్కువగా బంగారంపైనే పెట్టుబడి పెడతారు. కానీ గత కొద్ది నెలల నుంచి బంగారం కొనుగోళ్లు నిలిచిపోవడంతో అది ధరల ప్రభావం అని దుకాణాల యజమానులకు అర్థమయింది.
మళ్లీ పెరిగి...
బంగారం అంటే కేవలం స్టేటస్ సింబల్ కాదు.. సెంటిమెంట్ కూడా ఇప్పటి వరకూ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల ప్రభావంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,610 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,194 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,44,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు జరగవచ్చు.