Gold Price Today : గోల్డ్ కొనాలనుకుంటున్నారా? ఇదే సరైన టైం.. ఇంతకు మించిన సమయం దొరకదు
ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్నది సామెత. బంగారం విషయంలో అది అక్షరాలా నిజమవుతుంది. ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో కొనేవారు లేక అనేక షాపులు మూసివేసే పరిస్థితికి వచ్చాయి. బంగారు వ్యాపారులే ధరలు తగ్గాలని కోరుకుంటున్నారంటే ఏ రేంజ్ లో ధరలు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధరలతో అసలు జ్యుయలరీ దుకాణాలకు వెళ్లడమే ఇటీవల కాలంలో మానేశారు. కార్పొరేట్ జ్యుయలరీ దుకాణాల్లో కేవలం విండో షాపింగ్ మాత్రమే జరుగుతుంది. కొనుగోళ్లు జరగకపోవడంతో దుకాణల నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని షాపుల యాజమాన్యం లబోదిబో మంటుంది.
విపరీతంగా పెరిగి...
బంగారం ధరలు ఇంత విపరీతంగా పెరిగినప్పుడే అనేక అంచనాలు వినిపించాయి. ఇంతగా పెరిగిన బంగారం ధరలు అలాగే ఉండవని, తగ్గుతాయని అనేక మంది అంచనా వేశారు. బంగారం అంటే మొహం మొత్తేలా ధరలు పెరిగిపోవడంతో దానిని కొనుగోలు చేయడం శుద్ధ దండగ అన్న అభిప్రాయానికి వచ్చారు చాలా మంది. అలాంటి పరిస్థితుల్లో అనేక కారణాలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు విపరీతంగా పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరగడంతో పెళ్లిళ్ల సీజన్ అయినా, అక్షర తృతీయ అని అటువైపు చూసిన వారు తక్కువగానే ఉన్నారు. పైగా ఎన్ని ఆఫర్లు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు ప్రకటించినా అటు వైపు వెళ్లలేదు.
నేటి ధరలు ఇవీ...
జ్యుయలరీ దుకాణాలకు వెళితే టెంప్ట్ అయి కొనుగోలు చేస్తామోనని భయపడి మానుకున్న వారు అధికమే. ఎందుకంటే బంగారాన్ని టచ్ చేస్తే షాక్ తగిలేలా ఉండటంతో దానికి దూరంగా ఉండటమే మంచిదన్న భావనలో ఉన్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు తగ్గింది. ఈరోజు కూడా స్వల్పంగా అంటే పది గ్రాముల ధరపై పది రూపాయలు తగ్గింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,720 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,900 రూపాయలుగా నమోదయింది.