కేవలం రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5000 పెన్షన్‌.. మోడీ సర్కార్‌ అద్భుతమైన పథకం

పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏదైనా నెలవారీ ఆదాయం తప్పనిసరి ఉండాల్సిందే..

Update: 2024-02-15 15:36 GMT

APY Scheme

పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏదైనా నెలవారీ ఆదాయం తప్పనిసరి ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో నెలవారీ పెన్షన్‌ ఉంటే బాగుంటుంది. అప్పుడే పదవీ విమరణ తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. వృద్ధాప్యంలో పెన్షన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్లాన్‌ను తీసుకువచ్చింది. అందుకే ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన (APY) పథకం అందుబాటులో ఉంది.

రూ.5000 వరకు పింఛను కావాలంటే..

అటల్ పెన్షన్ యోజనలో డిపాజిట్‌ చేయడం ద్వారా పెన్షన్‌ అందుకోవచ్చు. ఇందులో డిపాజిట్‌ చేసినదాన్ని బట్టి నెలారీ పెన్షన్‌ అందుకోవచ్చు. రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంటే పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయం పొందవచ్చు. APYలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి 18 నుండి 40 ఏళ్లు.

అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పొందడానికి కనీసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. మీరు 40 సంవత్సరాల వయస్సు నుండి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. APYలో పెట్టుబడి పెట్టడం వలన గ్యారెంటీ పెన్షన్ మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీని వల్ల రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పన్ను మినహాయంపు పొందవచ్చు.

ఎంత డిపాజిట్‌ చేస్తుండాలి?

18 ఏళ్ల వయసులో ఈ ప్లాన్‌ తీసుకుంటే నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. అంటే రోజుకు 7 రూపాయలు అవుతుంది అన్నట్లు. రూ.3,000 పెన్షన్‌ కావాలంటే నెలకు రూ.126 పెట్టుబడి అవసరం. ఇక 4000 రూపాయల పెన్షన్‌కు రూ.168 డిపాజిట్‌. అలాగే 1000 రూపాయల పెన్షన్‌ కావాలంటే నెలవారీగా 42 రూపాయలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ అటల్‌ పెన్షన్‌ పథకంలో డిపాజిట్‌ చేయడం ద్వారా నెలవారీ పెన్షన్‌ అందుకోవచ్చు.

Tags:    

Similar News