YSRCP : వైసీపీ చేతిలోనే కడప మేయర్ పదవి
కడప మేయర్ పదవిని వైసీపీ చేజిక్కించుకుంది
కడప మేయర్ పదవిని వైసీపీ చేజిక్కించుకుంది. కడప కార్పొరేషన్ మేయర్ గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. కడప మాజీ మేయర్ సురేష్ బాబును తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే టీడీపీ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వైసీపీ కార్పొరేటర్లు ఆశించిన స్థాయిలో రాలేదు. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లుండగా అందులో 49 మంది వైసీపీ నుంచి గెలిచారు.
మెజారిటీ స్థానాల్లో...
కానీ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఎనిమిది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. టీడీపీకి ఎనిమిది మంది, వైసీపీకి నలభై రెండు మంది కార్పరేటర్లున్నారు. అందులో ఇద్దరు కార్పొరేటర్లు మరణించారు. అయినా వైసీపికి బలం ఉండటంతో టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో పాకా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.