YSRCP: నేడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ నిరసనలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు తెలియజేయనుంది. యూరియా కొరతతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమయింది.

Update: 2025-09-09 02:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు తెలియజేయనుంది. యూరియా కొరతతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమయింది. అన్ని ఆర్టీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలను తెలపాలని వైసీపీ నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ ఈ నిరసనలకు దిగింది.

యూరియా కొరతపై...
అయితే అనుమతి లేకుండా నిరసనల ప్రదర్శనలు చేయకూడదని పోలీసులు తెలిపారు. అన్ని ఆర్టీవో కార్యాలయాల ఎదుట యూరియా కొరతపై నిరసనలు తెలిపి అనంతరం ఆర్టీవోలకు వినతి పత్రాలను వైసీపీ నేతలు అందచేయనున్నారు. రైతులతో కలసి వైసీపీ నేతలు ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News