YSRCP : నేడు అంబేద్కర్ విగ్రహాల ఎదుట వైసీపీ నిరసన
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రయివేటీకరణకు నిరసనగా నేడు వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయనుంది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రయివేటీకరణకు నిరసనగా నేడు వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయనుంది. మెడికల్ కళాశాలలను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేపట్టనుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు...
కొందరు ఎస్సీ సెల్ నేతలను పోలీసు అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలంటూ వైసీపీ ఎస్సీ సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని అంబేద్కర్ సాక్షిగా ఎండగడతామని తెలిపారు.