Midhun Reddy : నేడు లొంగిపోనున్న మిధున్ రెడ్డి
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కానున్నారు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు, తమ పార్టీ ఎంపీలను సమన్వయం చేసుకునేందుకు ఐదు రోజుల పాటు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ నెల 11వ తేదీన రాజమండ్రి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.
నేడు రాజమండ్రి జైలుకు...
దీంతో నేడు రాజమండ్రి జైలుకు మిధున్ రెడ్డి వెళ్లనున్నారు. హైదరాబాద్ లో ఉన్న మిధున్ రెడ్డి విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. ఆయనకు ఇచ్చిన ఐదు రోజులు గడువు ముగియడంతో నేటి నుంచి తిరిగి ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి గత 47 రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై కూడా తీర్పు రావాల్సి ఉంది.