Breaking : వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి స్వల్ప ఊరట
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిధున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది.
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిధున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. ఈ నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనను అనుమతించాలని మిధున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటీషన్ వేశారు. పార్లమెంటు పార్టీ నేతగా ఉండటంతో ఎంపీలను సమన్వయం చేసుకునేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిధున్ రెడ్డి కోరారు.
ఈరోజు మధ్యాహ్నం...
అయితే ఉప రాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే మధ్యంతర బెయిల్ లభించింది. తిరిగి ఈ నెల 11వ తేదీన రాజమండ్రి జైలులో సరెండర్ కావాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి గత కొద్ది రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.