యూ టర్న్ తీసుకున్న ఎమ్మెల్సీ జకియా ఖానం
వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన రాజీనామాను ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు
వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన రాజీనామాను ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారించారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన ఎమ్మెల్సీలతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలనుమండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ చేపట్టారు. అయితే తన రాజీనామా ఉపసంహరించుకుంటానని జకియా ఖానం తెలిపారు.
వైసీపీ నుంచి ఎన్నికై...
వైసీపీ తరఫున ఎన్నికయిన జకియా ఖానం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జకియా ఖానం బీజేపీలో చేరారు. అయితే మండలి ఛైర్మన్ విచారణలో మాత్రం తాను రాజీనామాను ఉప సంహరించుకుంటానని చెప్పడం విశేషం. మండలి చైర్మన్ విచారణకు నిన్న జయమంగల వెంకట రమణ, మర్రి రాజశేఖర్, బల్లి చక్రవర్తి, పద్మశ్రీలు విచారణకు హాజరయ్యారు.రాజీనామాలకు ఒత్తిడి ఉందా అని ప్రశ్నించిన చైర్మన్ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.