Vijayawada : బెజవాడలో 390 కోట్ల రూపాయల దేవాదాయ శాఖ భూమి నేతల చేతుల్లోకి?

టిడిపి నేతలు విజయవాడ గొల్లపూడిలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 39.99 ఎకరాల ప్రధాన భూములను ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారని వైసీపీ నేతలు ఆరోపించారు

Update: 2025-09-09 04:36 GMT

కూటమి ప్రభుత్వ మద్దతుతో టిడిపి నేతలు విజయవాడ గొల్లపూడిలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 39.99 ఎకరాల ప్రధాన భూములను ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎకరా దాదాపు పది కోట్ల రూపాయల విలువైన ఈ భూములను దశాబ్దాల క్రితం భక్తులు దేవాలయ పూజలు, ఉత్సవాల కోసం విరాళంగా ఇచ్చారు. ఇప్పటివరకు భూముల లీజు ఆదాయం ధూప, దీప, నైవేద్యం, వార్షిక ఉత్సవాల కోసం వినియోగించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధీనంలో టిడిపి నేతలు ఈ భూములను గోల్ఫ్ కోర్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరుతో మళ్లిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అభివృద్ధి పేరుతో...
కూటమి ప్రభుత్వంఅభివృద్ధి పేరిట లీజు పేరుతో భూములను ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతుందని, ఇందులో టీడీపీ నేతల హస్తముందని వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో ఐదు ఎకరాలను గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్‌కు, మరో 34.99 ఎకరాలను విజయవాడ ఉత్సవ్ పేరుతో శాశ్వత ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు కేటాయించాలని నిర్ణయించారని తెలిపారు. వాస్తవానికి ఇది పర్యాటక ప్రోత్సాహం, ఎగ్జిబిషన్ అనే నెపంతో 36.89 ఎకరాల దేవాలయ భూమిని స్వాధీనం చేసుకునే పన్నాగం అని భక్తులతో పాటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. షాకింగ్ అంశం ఏమిటంటే ప్రతిపాదిత లీజ్ రేటు ఎకరాకు సంవత్సరానికి కేవలం 560 మాత్రమే నిర్ణయించడం కూడా విమర్శలకు తావిచ్చినట్లయింది.
వేలంలో టీడీపీ నేతలేనని వైసీపీ ఆరోపణ...
ప్రభుత్వ వేలంలో లీజు హక్కులు పొందిన రైతులు తమ కాలం ఇంకా పూర్తికాలేదని, అయినప్పటికీ భూములను బలవంతంగా వెనక్కి తీసుకుని టిడిపి నేతలకు అప్పగిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, ఎందుకంటే దేవాలయ భూములు కేవలం బహిరంగ వేలం ద్వారానే లీజ్ ఇవ్వాలనే స్పష్టమైన నియమం ఉన్నా దానిని అమలు పర్చడం లేదని ఆరోపిస్తున్నారు. 2017లో టిడిపి నేతలు ఈ దేవాలయాన్ని విజయవాడ దుర్గమ్మ దేవాలయ పరిధిలోకి తీసుకువచ్చి భూములపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించారని, . అప్పట్లో నిధులు మంజూరు చేయకపోవడంతో దేవాలయం పాడుబడిదని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ దేవాలయాన్ని తిరిగి ఎండౌమెంట్స్ శాఖ పరిధిలోకి తెచ్చి, సీఎఫ్‌డి నిధుల నుంచి రూ.1.80 కోట్లు, భక్తులు ఇచ్చిన రూ.20 లక్షలు కలిపి దాదాపు రూ.2 కోట్లతో దేవాలయ పునరుద్ధరణ పనులు చేపట్టారని పేర్ని నాని చెప్పారు.
Tags:    

Similar News