YSRCP : కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్

వైసీపి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది.

Update: 2025-11-19 02:56 GMT

వైసీపి అధికార ప్రతినిధి కారుమూరి కి షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొన్న వైసీపి అధికార ప్రతినిధి, కారుమూరి వెంకట రెడ్డిని వైద్య పరీక్షల అనంతరం, తాడిపత్రి సివిల్ జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. కారుమూరి వెంకటరెడ్డి పరకామణి కేసులో నిందితుడిగా ఉన్న అధికారి ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఫిర్యాదు అందింది.

నిన్న అరెస్ట్ చేసిన...
దీంతో నిన్న తాడిపత్రికి చెందిన పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. అయితే కారుమూరి వెంకటరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. దీంతో వెంకటరెడ్డికి బెయిల్ లభించినట్లయింది.


Tags:    

Similar News