YSRCP : వైసీపీ కీలక నిర్ణయం... ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు
వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని నిర్ణయించింది
వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ముందుగా తమ పార్టీ అధినేత జగన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఫోన్ చేశారని, అందుకే తాము ఆయనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నేతలతో చర్చించిన తర్వాత...
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ లోని సీనియర్ నేతలందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా ఉభయ సభల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పదకొండు మంది ఉండటంతో కీలకంగా మారనుంది.