Breaking : హైకోర్టులో వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ
హైకోర్టులో వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై దాఖలయిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టులో వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై దాఖలయిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో పోలింగ్ కేంద్రాలను మార్చడంపై అభ్యంతరం తెలుపుతూ ఈ పిటీషన్ ను వైసీపీ నేతలు దాఖలు చేశారు. పులివెందుల నియోజకవర్గంలో మార్చిన పోలింగ్ కేంద్రాలను మార్చకుండా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని పిటీషన్ లో కోరింది.
పిటీషన్ ను డిస్మిస్ చేసి...
అయితే ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉండటంతో ఈ సమయంలో దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. తగిన సమయం కూడా లేనందున దీనిపై ఆదేశాలు ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. వైసీపీ నేతలు వేసిన పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. రేపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది.