YSRCP : మైలవరం వైసీపీ నేత అరెస్ట్
వైసీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధిని కోమటి కోటేశ్వరరావును మైలవరం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధిని మైలవరం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున పోలీస్ స్టేషన్ కు తరలివచ్చాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైలవరం వైసీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కోమటి కోటేశ్వరరావును మైలవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుచిత పోస్టింగ్ లపై...
ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, నందమూరి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందిన ఫిర్యాదుతో మైలవరం పోలీసులు కోమటి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మైలవరం సీఐ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ ప్రాంతంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.