Ys Jagan : నేడు రెండో రోజు పులివెందులలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది. ఈరోజు జగన్ పలు ప్రయివేటు కార్యక్రమాలతో పాటు రైతులను కూడా పరామర్శించనున్నారు. ప్రధానంగా అరటి రైతులతో జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. అరటికి తగిన గిట్టుబాటు ధరలు లభించక రైతులు తమ అరటితోటలను తామే ధ్వంసం చేసుకుంటున్నారు. బ్రాహ్మణపల్లికి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు.
రైతులతో ముఖాముఖి...
రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉండేలా ప్రతిపక్షంగా తాము ఆందోళనకు దిగుతామన్న హామీ ఇవ్వనున్నారు. అనంతరం లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందులలోని తన నివాసానికి చేరుకుని రాత్రి ఏడు గంటల వరకూ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. కార్యకర్తలను కూడా కలుసుకోనున్నారు.