Ys Jagan : నేడు గుంటూరు జిల్లాకు జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మిర్చియార్డును సందర్శించనున్నారు.

Update: 2025-02-19 02:10 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మిర్చియార్డును సందర్శించనున్నారు. మిర్చి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. మిర్చిరైతులు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమ పంట కోసం పెట్టుబడి కూడా రావడం లేదని, ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు.

మిర్చియార్డుకు వెళ్లి...

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రైతుల వద్దకు వెళ్లి పరామర్శించనున్నారు. వారికి అందుతున్న గిట్టుబాటు ధరలను గురించి ప్రశ్నించనున్నారు. రైతుల కోసం తమ పార్టీ నిలబడుతుందని భరోసా ఇవ్వనున్నారు. పత్తి, ధాన్యానికి కూడా గిట్టుబాటు ధరలేదని, దీనిపై ప్రభుత్వం మెడలు వంచేలా తాము ఆందోళనకు సిద్ధమవుతామని జగన్ ప్రకటించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News