Ys Jagan : ఈ నెల 25న రాజమండ్రికి వైఎస్ జగన్

ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు

Update: 2025-08-17 01:58 GMT

ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్టీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తో ములాకత్ కానున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ పర్యటన ఖరరాయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

మిధున్ రెడ్డికి పరామర్శ...
మిధున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గత కొద్ది రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. మిధున్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే ఉంటూ ఆయనకు ఇంటి భోజనం ప్రతి రోజూ పంపుతున్నారు. దీంతో మిధున్ రెడ్డిని కలవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి వైఎస్ జగన్ పరామర్శించేందుకు రాజమండ్రి వెళుతున్నారు.


Tags:    

Similar News