Ys Jagan : నేడు రాజంపేటకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు, రాజంపేటలో జరిగే ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొంటారు

Update: 2025-08-19 02:23 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు నుంచి రానున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి నేరుగా ఆయన రాజంపేటకు చేరుకుంటారు.

వివాహ రిసెప్షన్ లో పాల్గొనేందుకు...
బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు రాజంపేట చేరుకుంటారు, అక్కడినుంచి ఆకేపాడు చేరుకుని ఆకేపాటి ఎస్టేట్స్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.


Tags:    

Similar News